ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 7
సిపిఐ ( ఎమ్ ఎల్) చంద్ర పుల్లారెడ్డి అనుబంధ సంఘం తెలంగాణ రైతు కూలి సంఘం అధ్యక్షుడు సుద్దపల్లి సుధాకర్ శ్రీకాంత్ లను నిన్న మధ్యానం సిరిసిల్ల పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారికి ఎలాంటి హాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరు పర్చాలని సిరిసిల్ల పోలీసులు అధికారులను సీపీఐ ( ఎమ్ ఎల్) పార్టీ జాతీయ కార్యదర్శి అజాద్ ఒక ప్రకటనలో కోరారు ,నేడు మావోయిస్టు,లొంగుబాటు,ఎన్కౌంటర్ నేపథ్యం లో ప్రజాస్వామ్య పద్ధతిలో నిత్యం ప్రజల మధ్య ప్రజా సమస్యల కోసం పని చేస్తున్నా రైతు కూలి సంఘం నాయకుడు సుద్దపల్లి సుధాకర్ , శ్రీకాంత్ ఇతరులను సిరిసిల్ల పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వారి కుటుంబ సభ్యులు మానసిక ,బయపడుతున్నారు ,సుధాకర్, శ్రీకాంత్ ఆరోగ్యం తో లేరు కావున వారిని వెంటనే కోర్టులో హాజరు పర్చాలని ఆయన కోరారు.















