ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 8
తెలంగాణలో జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలపై సమీక్ష చేపట్టి, పాలనా సౌలభ్యం, స్థానిక అవసరాలు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించనుంది. మున్సిపల్ ఎన్నికల అనంతరం ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశముంది. కొత్తగా మరో 5 జిల్లాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని ఆదిలాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.















