ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 8
చైనా మాంజాపై కేంద్రం నిషేధం విధించిందని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. కొన్ని ఈ కామర్స్ సైట్లకు నోటీసులు ఇచ్చామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్రమంగా నిల్వ చేసి చైనా మాంజాను విక్రయిస్తున్నారని, చైనా మాంజాకు గాజు పెంకులు, మెటలిక్ కోటింగ్ చేస్తారని తెలియజేశారు. గోల్కొండ, చార్మినార్ జోన్ల పరిధిలో భారీగా మాంజా స్వాధీనం చేశామని సజ్జనార్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో భారీగా చైనా మాంజా పట్టుకున్నామని, రూ.1.2 కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం చేసుకున్నామన్నారు. చైనా మాంజా అమ్ముతున్న 143 మందిపై నమోదు చేయడంతో పాటు కేసులు నమోదు చేశామన్నారు. ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర నుంచి చైనా మాంజాను తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నారని తెలిపారు.















