ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 8
సెంట్రలైజ్డ్ కిచెన్స్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందిచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో విద్యా శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశానికి హాజరైన ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం ప్రిన్సిపాల్ సెక్రటరీ శేషాద్రి, స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విద్యా శాఖ కమిషనర్ యోగితా రాణా, ఉన్నతవిద్యా మండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సిఎం మాట్లాడుతూ ఇందుకు ప్రతీ రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని సూచించారు. సోలార్ కిచెన్ లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్న సీఎం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చూడాలని , ఇందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు
.















