ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 9
ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గా సికింద్రాబాద్ జిల్లా, యూనివర్సిటీ పీజీ కాలేజీ విద్యార్థి లావణ్య ఎన్నికయ్యారు. ఈనెల 3,4,5 తేదీల లో శంషాబాద్ లో జరిగిన 44వ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర అధ్యక్షలు డా రావల కృష్ణ సార్ నూతన కార్యవ ర్గంను ప్రకటించగా సికింద్రాబాద్ నుండి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా లావణ్య,శ్రీరామ్, గౌతమ్ రెడ్డి దక్కింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ పై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యవర్గం లో అవకాశం కల్పించిన రాష్ట్ర శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో, విద్యార్థులలో జాతీయవాదం పెంచడానికి కృషి చేస్తామని తెలిపారు. నాయకులు యువజన నాయకులు పలువురు అభినందనలు తెలిపారు…













