ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 9
వాహనదారులకు శుభవార్త. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని, హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పంతంగి టోల్ ప్లాజా వద్ద నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అత్యాధునిక శాటిలైట్ ఆధారిత ఆటోమేటిక్ టోల్ వసూళ్ల విధానాన్ని ట్రయల్ రన్‌గా అమలు చేసింది.ఈ ట్రయల్ రన్‌లో మొత్తం 16 టోల్ బూత్‌లలో విజయవాడ దిశగా వెళ్లే వాహనాల కోసం 8 బూత్‌లను తెరిచి, సెన్సార్ల సహాయంతో వాహనాల నంబర్ ప్లేట్లను గుర్తించి టోల్ వసూలు చేసే విధానాన్ని పరిశీలించారు.శాటిలైట్ టెక్నాలజీ ద్వారా నిమిషానికి సగటున 20 వాహనాల వరకు టోల్ వసూలు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ విధానం అమల్లోకి వస్తే టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా, ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రయాణికులకు సమయం ఆదా అవుతుందని స్పష్టం చేశారు.













