ఈతరం భారతం జనవరి 11 హైదరాబాద్ పాతబస్తీలోని అగాపురాలో ఉండే గోల్డెన్ డ్రాగన్స్ కరాటే ట్రైనింగ్ సంస్థ ఇవ్వాళ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు “టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్” బిరుదు ప్రదానం చేసిందిసుమారు నలభై ఏళ్లుగా హైదరాబాద్ నగరంలో వేలాది మందికి కరాటే కోచింగ్ ఇచ్చిన ప్రొఫెసర్, డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ సిద్దీఖ్ మొహమూదీ చేతుల మీదుగా పవన్ కళ్యాణ్‌కు ఒక సాంప్రదాయ కరవాలం కూడా ప్రదానం చేశారు.
మార్షల్ ఆర్ట్స్, ఆక్యుపంక్చర్, ఫిజియోథెరపీ, చిరోప్రాక్టర్, మాగ్నెటో థెరపీ, అరోమాథెరపీలలో నైపుణ్యం ఉండటంతో పాటు “చేతబడి, మంత్రాలకు విరుగుడు” చేయడంలో కూడా డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ సిద్దీఖ్ మొహమూదీ సిద్దహస్తుడు అని ఆయన ప్రొఫైల్‌లో పేర్కొనడం విశేషం.
పవన్ కల్యాణ్‌కు ఈ అరుదైన అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వడం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.













