EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే సీఎం చేస్తాం : నరేంద్ర మోడీ

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే సీఎం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేసారు. ఎల్బీ స్టేడియంలో బిజెపి బీసీ ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పలురు బిజెపి నేతలు హాజరయ్యారు. ఓపెన్ టాప్ జీప్ లో ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని మోడీ సభా ప్రాంగణం చేరుకున్నారు ఈ సందర్భంగా ప్రదాని మోడీ మాట్లాడుతూ బిఆర్ఎస్ రాష్ట్రాన్ని లూటీ చేస్తుందని, ప్రజాధనాన్ని లూటు చేసే వాళ్ళ సంగతి తెలుస్తామన్నారు ప్రధాని మోడీ టిఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒకటేనని కొడుకు బిడ్డ కోసం పనిచేస్తున్నాయన్నారు. టిఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల డిఎన్ఏ ఏ ఒక్కటేనని మూడు పార్టీల కుటుంబ పాలన కొనసాగుతున్నాయని మోడీ విమర్శించారు అహంకార ఎంతో కాలం నిలువదని అహంకారం తో విర్రవీగే వారు కాలగర్బం లో ఎలా కలిసిపోయారో మన చరిత్రలు చెపుతున్నయన్నారు. సీఎంకు బీసీలు ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రధాని నరేంద్ర మోడీ బిసిలకు పిలుపు నిచ్చారు.ఈ సభ బీసీ ఆత్మకార సభలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నారన్నారు. ఎల్బీ స్టేడియం తో నాకు అనుబంధం ఉందని ఇదే గ్రామంలో ప్రజల ఆశీర్వాదంతో నేను ప్రధాని అయ్యానని మోడీ చెప్పారు బీసీ ముఖ్యమంత్రి చేయాలని ఇక్కడి నుంచి నిర్ణయం జరగాలని అన్నారు.ఇక్కడి నుంచే తెలంగాణకు బీసీ సీఎం రాబోతున్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీపైనే విశ్వాసంతో ఉన్నారు. ఈ నేలతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది. అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారు. 9 ఏళ్లుగా BC, SC, ST విరోధి అధికారంలో ఉన్నారన్నారు. టిఆర్ఎస్ పార్టీ బీసీని ఎందుకు ముఖ్యమంత్రి చేయడం లేదని మోడీ ప్రశ్నించారు. తెలంగాణలో 9 ఏళ్లుగా బీసీ ఎస్సీ ఎస్టీ వ్యతిరేక పాలన సాగుతుందని ప్రధాని ఆరోపించారు. నవంబర్ 30న మీ విరోధిని సర్కార్ ను గంగలో విసిరి కొట్టాలని మోడీ అన్నారు. బిజెపి సర్కార్ దళిత ఆదివాసులకు ప్రాదాన్యత ఇస్తుందన్నారు రామ్నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిని చేశామని,ని గిరిజన బిడ్డను ఇప్పుడు రాష్ట్రపతిని చేశామని మోడీ స్పష్టం చేశారు. బీసీలకు ఏ పార్టీ ప్రాదాన్యతను ఇవ్వలేదన్నారు. మోదీ కేంద్ర కేబినెట్లో 27 మంది ఓబిసిలు ఉన్నారని అన్నారు. డెంటల్ కాలేజీలో 27% ఓఫీసులకు రిజర్వేషన్ ఇస్తున్నామన్నారు .బీసీని వ్యక్తిని ప్రధాని చేసి నన్ను గౌరవించారన్నారు.తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు, నిధులు, నియామకాల కోసం కాని కేసీఆర్ సర్కార్ ప్రజలను మోసం చేస్తున్నారని మోడీ అన్నారు. నిరుద్యోగులను కేసీఆర్ సర్కార్ నిండా ముంచిందని, టీఎస్పీఎస్సీని అక్రమాల పుట్టగా చేశారని విమర్శించారు.

Related News

Select the Topic
Scroll to Top