రాజేంద్రనగర్లో కాంగ్రెస్ ప్రజా విజయభేరి సభలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.తెలంగాణలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని, తాగుడులో తెలంగాణను నంబర్ వన్ చేశారని రేవంత్రెడ్డి సీఎం కేసీఆర్పై మండిపడ్డారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎందరికి ఇచ్చారని, కాంగ్రెస్ సునామీలో బిఅర్ఎస్ కొట్టుకుపోతుందని రేవంత్రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.4 వేలు పెన్షన్ ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.