EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

భువనగిరి ఖిల్లా పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

భువనగిరి ప్రజల అభిమానంతో పక్కా విజయం సాధిస్తానని ఈసారి భువనగిరి ఖిల్లా పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన తన నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా మాట్లాడుతూ, పడేళ్ల కేసీఆర్ సర్కారు ప్రజల విశ్వాసం కోల్పోయిందని సమాజంలో అన్ని వర్గాలు కెసిఆర్ పాలనకు చరమగీతం పాడాలని ఎదురుచూస్తున్నాయని ఆయన అన్నారు.భువనగిరి నియోజకవర్గం లో స్థానిక శాసనసభ్యులు అశ్రద్ధ వల్ల అభివృద్ధి కుంటుపడిందని రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో కానీ మార్పు రావాలి అంటే కాంగ్రెస్ రావాలని ఆయన అన్నారు. పదేళ్ల నుండి కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నో కేసులకు ఇబ్బందులకు ఓర్చుకొని కెసిఆర్ ప్రజా వ్యతిరేక విధానాలకు ఎదురొడ్డి పోరాడుతున్నారని మరో 20 రోజుల్లో వారి బాధలు తీర్చే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని బోనగిరి నియోజకవర్గం లో కూడా ప్రజల అభిమానంతో తన గెలుపు ఖాయమని అన్నారు. శాసనసభ్యుడుగా తనకు అవకాశం ఇస్తే, భువనగిరిని ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిషత్తు మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోత్నాక్ ప్రమోద్ కుమార్ ఓబీసీ సెల్ నాయకులు తంగళ్ళపల్లి రవికుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ , పోతంశెట్టి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఈరపాక నరసింహ వడిచర్ల కృష్ణ యాదవ్,,సలావుద్దీన్ కైరం కొండ వెంకటేష్ పడిగల రేణుక కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లేష్ యాదవ్ చిక్కుల వెంకటేష్, లూర్ధయ్య బెండ శ్రీకాంత్ బీస్ కుంట్ల సత్యనారాయణ, కూర వెంకటేష్ మజార్ అవైస్ చిస్తీ,గాజుల కుమార్మాదాసు గోవర్ధన్ బై శెట్టి రవీందర్ కాలేరు వినోద్ ఓబిసి నేతలు రత్న రాజశేఖర్,నాకోటి రాము పట్టణ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు స్వరూప,కాలేరు శ్రీలతవినోద్, కల్యా స్వాతి తదితరులు పాల్గొన్నారు

తరలి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు

భువనగిరి ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ఈ నామినేషన్ కార్యక్రమానికి భువనగిరి పట్టణం అన్ని వార్డుల నుండి ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ శ్రేణులు అత్యధిక సంఖ్యలో తరలి రావడంతో పట్టణంలో సందడి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు గ్రామ శాఖ మండల శాఖ అధ్యక్షులు యువజన కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ సేవాదళ్ విభాగాల నాయకులు ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. గత 30 ఏళ్ల నుండి కాంగ్రెస్ కు ఎమ్మెల్యే లేకపోవడం ఈసారి ఎలాగైనా గెలిపించుకోవాలన్నా పట్టుదలతో అన్ని గ్రామాల నుండి కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. 

 

Related News

Select the Topic
Scroll to Top