కార్వాన్ బీజేపీ ఎమ్ ఎల్ ఏ అభ్యర్థి టీ. అమర్ సింగ్ గురువారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం కార్వాన్ తాళ్లగడ్డ కబడ్డీ స్టేడియం ఎదురుగా గల చారిత్రక హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించిన తర్వాత అమర్ సింగ్ కార్యకర్తలు బీజేపీ నేతలతో కలిసి ఓపెన్ టాప్ జీపులో భారీ ఊరేగింపుగా బయలుదేరి గోల్కొండ తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి V. K. సింగ్ తదితరులు ముఖ్య అథి తులుగా విచ్చేస్సి అమర్ సింగ్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. అమర్ సింగ్ ర్యాలీలో సాంస్కృతిక కార్యక్రమాలు కళాకారుల, బీజేపీ నేతల నృత్యాలు అలరించాయి. ఈ సందర్భంగా అమర్ సింగ్ మాట్లాడుతూ… కార్వాన్లో మజ్లిస్ పార్టీ చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదని ఆరోపించారు. ఈ సారి ఎన్నికల్లో మజ్లిస్ ను చిత్తుగా ఓడించేందుకు అన్ని వర్గాలతో పాటు ముస్లింలు కూడా సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్ ఎల్ ఏ గా తన గెలుపును ఏ రాజకీయ శక్తీ ఆపలేదు అని, గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురావేసి తీరుతాను అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ నేతలు యోగి రాజ్ సింగ్, గోవర్ధన్, సాగర్, శివ్ రత్నం, సతీష్ బిడ్ల, బిక్షపతి పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.