ఈతరం భారతం హైద్రాబాద్ ఏప్రిల్ 4:
ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని అందజేయాలి – లక్కీ డ్రాప్స్ మినరల్ వాటర్ విడుదల కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వెంకటేష్ ప్రజలకు నాణ్యమైన, స్వచ్ఛమైన మంచి నీటిని అందజేసేందుకు మినరల్ వాటర్ కంపెనీలు తమ వంతు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజీవ్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకటేష్ అన్నారు. లక్కీ డ్రాప్స్ మినరల్ వాటర్ సంస్థ కార్యాలయాన్ని వారసీ గూడ లో జరిగిన కార్యక్రమంలో వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్బంగా “లక్కీ డ్రాప్స్” మినరల్ వాటర్ ను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఓదెల శివరాజ్ తో కలిసి వెంకటేష్ మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్బంగా వెంకటేష్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా తాగునీటిని అందించాలని అన్నారు.మంచి క్వాలిటీతో చూడడానికి అందంగా లక్కీ డ్రాప్స్ మినరల్ వాటర్ బాటిల్స్ అందరికీ నచ్చుతుందని అన్నారు.అందులోని మంచినీరు కూడా ఎలాంటి కెమికల్స్ వాడకుండా సాధారణ మంచినీరు త్రాగితే ఏ విధంగా ఉంటుందో అలానే ఈ మినరల్ వాటర్ ఉందని అన్నారు. అందరూ వేసవి కాలంతో పాటు సాధారణ రోజుల్లో సైతం లక్కీ డ్రాప్స్ మినరల్ వాటర్ ను వాడాలని అన్నారు. కార్యక్రమంలో మదర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అంకేనపల్లి మల్లికార్జున రావు,నాగులపల్లి ఆనంద్ కుమార్,రాఘవ,ప్రశాంత్,అక్షయ్ కుమార్, సుశాంత్ తదితరులు పాల్గొన్నారు.















