EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

పద్మారావు అసమర్థత వల్లే సికింద్రాబాద్ అభివృద్ధి కుంటుపడింది

సికింద్రాబాద్ నియోజకవర్గంలో గత పది సంవత్సరాల నుంచి శాసన సభ్యులుగా కొనసాగుతున్న టి.పద్మా రావు అసమర్థత వల్ల సికింద్రాబాద్ అసెంబ్లీలో అభివృద్ధి కుంటుబడిం దని సికింద్రాబాద్ నియోజకవర్గంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి మేకల సారంగపాణి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని మేట్టు గూ డలో ఆయన పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ టి.పద్మారావు ప్రజల సమస్యలను ప్రక్కకు పెట్టి తన  స్వార్థం కోసం, ,తన అనుయాయుల కోసం పనిచేసాడన్నారు. నియోజకవర్గం లో కొంత మందికే, పార్టి కార్యకర్య్తలకు డబుల్ బెడ్ రూమ్స్ ఇచ్చారు తప్ప నిజమైన అర్హులైన పేదలను విస్మరించారని విమర్శించారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలనుండి వ్యతిరేకత   వస్తుందీ తప్ప స్పందన రావడం  లేదంటే ఇది ఆయన పనితీరుకు నిదర్శనమన్నారు.. సికింద్రాబాద్ నియోజకవర్గం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సారంగ పాని.   అన్నారు. తనను అత్యదిక మెజారిటితో గెలిపించాలని, తను గెలిచినా వెంటనే నిరుద్యోగ సమస్య పై ప్రత్యెక ద్రుష్టి పెడుతానన్నారు.రెండు పర్యాయాలు ఎమ్మెల్యే గా పని చేసిన పద్మా రావు వడ్డెర బస్తిలో ఆసుపత్రిని కట్టించలేకపోయరన్నారు. ఎమ్మెల్యేగా తనకు ఒక్క అవకాశం ఇస్తే సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని సారంగ పాణి హామీ ఇచ్చారు.

Related News

Select the Topic
Scroll to Top