EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

దేశవ్యాప్తంగా జనాభా గణన ముగిసే వరకు: ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం

ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 7

దేశవ్యాప్తంగా జనాభా గణన  ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేస్తూ, జనగణన ముగిసే వరకు (మార్చి 31, 2027) ఉద్యోగులను బదిలీ చేయకూడదని స్పష్టం చేసింది. తెలంగాణలో ఇప్పటికే 85 వేల మందికి పైగా ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నారని, వీరు వచ్చే నెల 11 నుంచి జూన్ 9 వరకు మొదటి దశలో ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారని, తిరిగి 2027 ఫిబ్రవరి, మార్చిలో రెండో దశ గణన చేపడతారని ఈ నోట్ సారాంశం.

Related News

Select the Topic
Scroll to Top