ఈతరం భారతం హైద్రాబాద్ ఏప్రిల్ 11:
సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా వారికి యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ జేఏసి, మలిదశ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అజ్ఞానపు చీకట్లను పారద్రోలిన సంఘసంస్కర్త, బాల్య వివాహాల రద్దు కోసం, వరకట్న నిషేధం కోసం, సతీసహగమనం నిషేధం కోసం , బాలికల విద్యకు, వితంతు పునర్వివాహలకి , తన జీవితం పోరాటాలకు ఇల్లు అని చాటి చెప్పిన జ్ఞాన ప్రదాత , మూఢనమ్మకాల నిషేధంపై పోరాడిన యోధుడు, స్త్రీజనోద్ధరణ కోసం , అస్పృశ్యత నిర్ములనకు, సమాజంలో పీడనాల నిషేధానికి, అసమానతల నిర్ములనకు,
మహిళా సాధికారత కోసం బీజం వేసిన యోధుడు, ప్రశ్నించే తత్వం రావాలన్న , మన హక్కుల కోసం పోరాడాలన్నా, సమాజంలో అసమానతలు రూపుమాపాలన్నా ఏకైక ఆయుధం చదువే అని బలంగా చాటిన మహాత్మ జ్యోతిబాపూలే గారి199 వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎనుగంటి రాజు నేత బాలకృష్ణ నేత, రాంబాబు నాయుడు, రాము, శ్రీనివాస్ అరవింద్ సురేందర్, ప్రేమ్ నరేష్, రాజేష్ తదితరులు హాజరయ్యారు.















