EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఏబివిపి బషీర్బాగ్ నగర శాఖ ఆద్వర్యం లో ఘనంగా అంబేత్కర్ జయంతి 

ఈతరం భారతం హైద్రాబాద్ ఏప్రిల్ 14

రాజ్యాంగ నిర్మాత, ప్రముఖ సంఘసంస్కర్త, ఆర్థిక వేత్త మరియు న్యాయవాది బీఆర్ అంబేత్కర్ 135 జయంతి సందర్భంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబివిపి) బషీర్బాగ్ నగర శాఖ ఆద్వర్యం లో ఘనంగా నిర్వహించారు. అంటరానితనానికి, కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడి, దళితుల, మహిళలు మరియు అనగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ఏబివిపి) బషీర్బాగ్ నగర శాఖ కార్యదర్శి సురేందర్, విభాగ్ గర్ల్స్ ప్రముక్ మమత ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంజన్, విభాగ్ ఎస్ఎఫ్ఎస్ కో కన్వీనర్ సుప్రజ్, సాయి, రవితేజ, రాహుల్, మనోజ్, వంశీ, రఘునందన్, శివ, సాయి, ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top