ఈతరం భారతం హైద్రాబాద్ ఏప్రిల్ 16
తెలంగాణ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లో ఆర్టిసన్లు, అవుట్‌సోర్సింగ్ మరియు పీస్ రేట్ గా పనిచేస్తూ రెగ్యులరైజేషన్ లేకుండా, ఉద్యోగ భద్రత లేకుండా, తక్కువ వేతనాలతో పనిచేస్తు విద్యుత్ ప్రసార వ్యవస్థను నిలకడగా కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తున్న దినసరి కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని కైవసం చేసుకొన్న తరుణంలో విద్యుత్ సేవలందిస్తున్న సుమారు 19,000 మంది కార్మికులను రెగ్యులరైజ్ చేయడం సముచితమైన నిర్ణయం అవుతుందని, ఇట్టి సమస్యపై సంబంధిత అధికారులు చర్చలు ప్రారంభించ కుండా, ఎస్మాను అమలు చేయడం మానవత్వానికే గొడ్డలి పెట్టని, దరిమిలా ప్రమాద బీమా నిలిపి వేయడం, ఉద్యోగాల నుంచి తొలగింపు హెచ్చరికలు జారీ చేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్య సూత్రాలకు పూర్తి విరుద్ధం. అందుకు గాను తెలంగాణా ముఖ్యమంత్రి సంబంధిత విషయమై వెంటనే జోక్యం చేసుకొవాలని మణికొండ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పిర్యాదు పత్రం అంద జేయడం జరిగినది, అందులో
• కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిశీలించాలి
• కార్మికులతో తక్షణ చర్చలు ప్రారంభించాలి
• బలవంతపు చర్యలను ఉపసంహరించాలి
• సమస్యకు న్యాయమైన పరిష్కారం చూపాలి
కార్మికుల సమస్యలను సానుభూతితో పరిష్కరించడం ద్వారా ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుందనీ భారత రాష్ట్ర సమితి పార్టీ స్థానిక నాయకులు హితవు పలికారు. సీతారం ధూళిపాళ, కుంభగల్ల ధనరాజ్, గుట్టమీది నరేందర్, అందె లక్ష్మణ్ రావు, యాలల కిరణ్, భానుచందర్, సుమనళిని తది తరులు పాల్గొన్నారు.















