ఈతరం భారతం హైద్రాబాద్ ఏప్రిల్ 16
రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి దార కాంతి కుమారి జన్మదిన వేడుకలు మంత్రుల సముదాయంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కాంతి కుమారి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు స్వీకరించారు.
ఈ వేడుకల్లో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, జర్నలిస్టులు, కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని ఆనందోత్సాహాల మధ్య విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కార్యాలయ సిబ్బంది OSD విజయ్ కుమార్, పి.ఆర్.ఓ అమృత్, పి.ఏలు ఎలుక రాజు యాదవ్, షిండే రవి కుమార్, మహంకాళి అశోక్, అడ్లూరి హరీశ్వర్, పలువురు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, సేవాభావంతో ముందుకు సాగితేనే సమాజం అభివృద్ధి సాధ్యమని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దైవభక్తి, ధర్మబద్ధతతో జీవిస్తేనే నిజమైన సంతోషం లభిస్తుందని పేర్కొన్నారు.
అలాగే ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల సహకారం కీలకమని, విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత రంగాల్లో మరింత చైతన్యం అవసరమని పిలుపునిచ్చారు. యువత సమాజ నిర్మాణంలో ముందుండాలని, గ్రామాభివృద్ధిలో చురుకుగా పాల్గొనాలని సూచించారు.
ఈ సందర్భంగా కాంతి కుమారి ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు కలగాలని పలువురు శుభాకాంక్షలు తెలిపారు.















