EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

ఈతరం భారతం భాగ్య నగరం బాలానగర్, ఏప్రిల్ 18:

బాలానగర్ లోని రాజు కాలని కమ్యూనిటీ హాలులో జనహిత సేవా ట్రస్ట్,  హెయిల్ టాటామణి చారిటబుల్ ట్రస్ట్, కిమ్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 150 మందికి సేవలు అందించారు. వైద్య శిబిరంలో కిమ్స్ ఆసుపత్రికి చెందిన ఆర్థోపెడిక్, గైనకాలజి, పెడియాట్రిక్స్, జనరల్ ఫిజిషియన్ వైద్యులు, ప్రతి ఒక్కరికి బీపీ, సుగర్ పరీక్షించి మందులను కూడా ఉచితంగా అందజేశారు. భారత్ వికాస్ పరిషత్ ద్వారా 95 మంది మహిళలకు హిమోగ్లోబిన్ శాతం పరీక్షించి, రక్త హీనత ఉన్నవారికి ఐరన్ ఫోలిక్ మాత్రలను అందజేశారు. ఈ శిబిరంలో హెయిల్ టాటామణి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ కాకుమాను లూర్ధు జ్యోతి, డైరెక్టర్ డాక్టర్ పొలంకి జగదీష్ కుమార్, సభ్యురాలు ప్రేమలత, జి.రాజు, అప్సా సిబ్బంది బుగ్గయ్య, రాణి,ఫిజియోథెరపిస్ట్ ఎం. శ్రీనివాస్, మెడికల్ క్యాంప్ కోఆర్డినేటర్ బి.నర్సింగ్ రావు, కిమ్స్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ విక్రమ్ పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top