ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 18
డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు మరియు అవసరమైన వారికి ఉచితంగా భోజనం అందజేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అన్నదానం సేవలను పొందారు. ఆకలి బాధలను తగ్గించడం మరియు అవసరమైన వారికి సహాయం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.సమాజ సేవలో భాగంగా ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు మరియు విద్యా కార్యక్రమాలు డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ నిరంతరం నిర్వహిస్తుందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన వాలంటీర్లు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.















