ఈతరం భారతం భాగ్యనగరం ఏప్రిల్ 18
నగరవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. ముఖ్యంగా నగరంలోని ప్రధాన ప్రాంతాలైన అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసరాల్లో వర్షం పడింది.
నగరంలోని శివారు ప్రాంతాలైన ఎల్బీ నగర్, హయాత్‌నగర్, వనస్థలిపురం, పెద్ద అంబర్‌పేట్ తదితర ప్రాంతాల్లో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, సాయంత్రానికి మేఘాలు కమ్ముకోవడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి.ఈ అకస్మిక వర్షం వల్ల రహదారులపై నీరు చేరి వాహనదారులు కొంత ఇబ్బంది పడినప్పటికీ, వేడి నుంచి విముక్తి లభించడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. రాగల కొన్ని గంటల్లో నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది.















