ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 20
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్,సికింద్రాబాద్ జిల్లా, SR నగర్ శాఖ “Vande Mataram On Campus” లో భాగంగా 150 ” యేళ్ళ వందేమాతరం సందర్భంగా హిందూ పబ్లిక్ స్కూల్,సనత్ నగర్ లో 1800 మంది విద్యార్థులతో సామూహిక పూర్తి వందేమాతర గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి “మాచర్ల రాంబాబు ” రావడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మన దేశం మనకు స్వేచ్ఛ ఇచ్చింది, విద్య ఇచ్చింది, అవకాశాలు ఇచ్చింది, కలలు కనడానికి ధైర్యం ఇచ్చింది.
అలాంటి దేశాన్ని గౌరవంగా నమస్కరించడం కోసం మనం చెప్పే మాటే “వందేమాతరం” ప్రపంచంలో దేశాన్ని గౌరవించే ఏదైనా దేశం ఉందంటే అది కేవలం మన భారత దేశమే.గౌరవించడమే కాకుండా మన దేశాన్ని తల్లిగా భావించె భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్ప సంప్రదాయం. అప్పట్లో స్వాతంత్ర సమరయోధం సమయంలో *“వందే మాతరం”* అనే మాట ప్రజల్లో ఒక ధైర్యం, ఐక్యత మరియు దేశభక్తిని పెంచింది.స్వాతంత్య్ర సమరయోధులు ఈ నినాదం చెప్పుకుంటూ పోరాడారు…భారతదేశంలోని ఎందరో మంది స్వాతంత్ర్య సమరయోధులు వారి యొక్క పోరాట పటిమను ఈ వందేమాతరం గేయంతోనే ప్రారంభించేవారు అన్ని వారు కొన్నియాడారు…
ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ రాధిక గారు, కూకట్పల్లి విభాగ్ కన్వీనర్ రేగోడ్ నాగేష్ , సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ చేర్క, బాలకృష్ణ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌతమ్,సిటీ SFD కన్వీనర్ పాండు,సిద్దు, రాడ్ని,రామ్మోహన్, హర్ష, రాము, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.















