నిజామాబాద్ నవంబర్ 10 (ఈతరం ఇండియా న్యూస్
)నిజామాబాద్ జిల్లా లోని నిరుపేద కుటుంబానికీ చెందిన చాత్తద శ్రీ వైష్ణవ సంఘము యొక్క సభ్యురాలు సంతోష లక్ష్మి అనారోగ్యo తో సరైన ఆర్థిక సహాయం అందక పోవటం కారణంగా ఈ నెల 4 న పరమపదించారు. ఇట్టి స్థితిలో చాత్తద శ్రీ వైష్ణవ సంఘము సబ్యులు మానవతా దృక్పదం తో స్పందించారు.ఆమె కుటుంబ సబ్యులకు ఆర్దిక సాయయాన్ని అందించారు. జిల్లా అధ్యక్షులు శ్రీమాన్ S.P.సుదర్శన్ స్వామీ ఆద్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ.స్. నారాయణ స్వామి మరియు జిల్లా కార్య వర్గ సభ్యులు శ్రీ.T. చక్రపాణి, శ్రీ D. వెంకట్ రాములు, నర్సింలు, V. లింబద్రీ పీఅర్ఓ. గ్రామ పెద్దలు, వింజమూరి నరసింహా స్వామి గార్లు వారి కుటుంబాన్ని వారి స్వగృహం కాలూరు లో పరామర్శించి , జిల్లా సంఘము తరపున Rs .5000/-, అధ్యక్షుల వారి వ్యక్తి గతంగా Rs.2000/-,.. అందించగా, జిల్లా కార్య వర్గ సభ్యులు D. వెంకట్ రాములు గారు వారి యొక్క ఆర్థిక స్థితి కి వెంటనే స్పందించి Rs .5000/- రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. కేశవ్ కుమార్ గారి చేతుల మీదుగా అందించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, జిల్లా నాయకులు వారి కుటుంబానికీ ఎల్ల వేళలా తోడుగా ఉంటుందని అన్నారు.















