ఈతరం భారతం హైద్రాబాద్ ఏప్రిల్ 23
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సికింద్రాబాద్ జిల్లా పీజీ కాలేజ్ ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ కొరకు నిరసన దీక్ష నిర్వహించడం జరిగింది…
కార్యక్రమానికి అతిథిగా వచ్చిన ఏబీవీపీ సిటీ సెక్రెటరీపృథ్వి తేజ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయులు పెండింగ్ లో ఉన్నాయి. ఇవి విద్యార్థుల బిక్ష కాదు విద్యార్థుల హక్కు.1200 మంది ఆత్మ బలిదానానికి న్యాయం లేకుండా పోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విద్యార్థి జీవితాలకు న్యాయం జరగడం లేదు. ప్రభుత్వం రాకముందు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నోటి మాటకే పరిమితమయ్యాయి. SC,ST విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లకిచ్చే నిధులు సైతం రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా తిరిగి వెనక్కి వెళ్తున్నాయి. ఈరోజు నిరసన దీక్షతో మొదలైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేసే వరకు ధర్నాలు,రాసారోకోలు, ముట్టడిలు నిరసనలు ఇలా మరో తెలంగాణ ఉద్యమాన్ని తీసుకువస్తామని హెచ్చరించడం జరిగింది…
ఈ కార్యక్రమంలో కూకట్పల్లి విభాగ్ కన్వీనర్ నగేష్, సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ చేర్క బాలకృష్ణ, యూనివర్సిటీ ప్రెసిడెంట్ అభినయ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మిద్దెల గౌతమ్, నగర కార్యదర్శి పవన్, గణేష్, రవి, శ్రీకాంత్, విజయ్,వంశీ, కిషోర్, విజయ్ కుమార్, దుర్గేష్, ప్రణయ్, సిద్దు, ప్రశాంత్, బెండ్మాన్, సాయి, సాయితేజ, వెన్నెల, నీరజ,బిస్మా మొదలగుణ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు..















