ఈతరం భారతం హైదరాబాద్ అంబర్‌పేట్:ఏప్రిల్ 26
మిల్లెట్ ఆధారిత ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన శ్రీ అన్న – ఫుడ్ అస్ మెడిసిన్ అనుభవ కేంద్రం” మల్లికార్జున నగర్, అంబర్‌పేట్, హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. సి. తారా సత్యవతి , డైరెక్టర్, ఐసిఏఆర్ – ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్, రాజేంద్రనగర్, హైదరాబాద్ హాజరై కేంద్రాన్ని ప్రారంభించారు.గౌరవ అతిథిగా డా. జె. స్టాన్లీ , డైరెక్టర్/సీఈఓ, న్యూట్రిహబ్ & ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఐసిఏఆర్ – మిల్లెట్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పాల్గొన్నారు
ఈ సందర్భంగా డా. తారా సత్యవతి మాట్లాడుతూ, ఫుడ్ అస్ మెడిసిన్” భావనను ప్రోత్సహిస్తూ, మిల్లెట్స్ అన్ని వయస్సుల వారికి, వివిధ ఆరోగ్య పరిస్థితులకు అనుకూలమైన పోషకాహారంగా ఉన్నాయని తెలిపారు. విలువ ఆధారిత మిల్లెట్ ఉత్పత్తులను అందించే ఈ అనుభవ కేంద్రం స్టార్టప్‌లకు మద్దతు ఇస్తూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు చేరవేయడం అభినందనీయమని అన్నారు.
డా. జె. స్టాన్లీ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో ప్రజలకు విభిన్న మిల్లెట్ ఆధారిత ఆహార ఎంపికలు అందుబాటులో ఉండటం ఆనందంగా ఉందని, ఇటువంటి కేంద్రాలు ఆరోగ్య అవగాహన పెంపుకు దోహదపడతాయని పేర్కొన్నారు.
చైర్మన్ డా. పి. వెంకటేశం మాట్లాడుతూ, ఈ కేంద్రం ద్వారా డాక్టర్లు, న్యూట్రిషనిస్టులు, డైటీషియన్లు సేవలు అందించి ప్రజలకు ఆరోగ్య మార్గదర్శకత్వం ఇవ్వబడుతుందని తెలిపారు. అలాగే టెలికాలింగ్ సపోర్ట్*ద్వారా ఇమ్యూనిటీ పెంపు మరియు ఆరోగ్య సమస్యల నిర్వహణకు సహాయం అందించబడుతుందని చెప్పారు.
అదేవిధంగా, స్టార్టప్‌లకు బి2బి, బి2సి, ఆన్‌లైన్ విక్రయాలు, వాల్యూ అడిషన్స్, కో-బ్రాండింగ్ అవకాశాలు కల్పిస్తూ, పాన్ ఇండియా ఫ్రాంచైజ్ అవకాశాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఈ కేంద్రం ద్వారా పాన్ ఇండియా డోర్ డెలివరీ అలాగే ఇంటర్నేషనల్ కూరియర్ సపోర్ట్ కూడా అందించబడుతుంది. భారత ప్రభుత్వం మిల్లెట్స్‌ను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో శ్రీ అన్న ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్ ఆధారిత ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉందన్నారు
ఈ కార్యక్రమంలో ట్రస్టీలు పి. మాణిక్యం, పి. బాలకృష్ణ మిల్లెట్స్ మదర్ పి. వెంకట లక్ష్మి, మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.మరిన్ని వివరాలకు: 9246370899 సంప్రదించాలని కోరారు.















