అందరం ఏకమైద్దాం, అవినీతి పాలనను అంతం చేద్దామని బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కోవూరి సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు. బీసీవై పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ అవినీతి పాలకులకు, అజ్ఞానంతో మెదిలే నాయకులకు తగిన బుద్ధి చెప్పే విధంగా సంఘటితంగా ఉద్యమించాలని అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు కన్న కలలను సాకారం చేసుకొని సంగారెడ్డి నియోజకవర్గంను బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ నేతృత్వంలో బడుగు బలహీన వర్గాల మరియు పేదరికంతో బాధపడుతున్న అగ్రవర్ణాలను సంపూర్ణంగా అభివృద్ధి పథ దిశలో ముందుకు తీసుకెళ్తూ అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం చేస్తూ అభివృద్ధి పథంలో ముందు ఉంటూ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని తెలియజేశారు.ఈ యొక్క కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
















