EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

30 న యంగ్ ఇండియా స్పోర్ట్స్ సమ్మిట్ 2026

ఈతరం భారతం హైదరాబాద్, ఏప్రిల్ 29

యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ & స్పోర్ట్స్ యూనివర్సిటీ (YIPESU) ఆధ్వర్యంలో “యంగ్ ఇండియా స్పోర్ట్స్ సమ్మిట్ 2026” కార్యక్రమం ఏప్రిల్ 30, 2026న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం (హాల్ నం. 113)లో ఘనంగా నిర్వహించబడనుంది. దేశంలోని క్రీడా విధానాలు, విద్య, పరిశోధన, సాంకేతికత మరియు ఉపాధి అవకాశాలపై చర్చించేందుకు ఈ సమ్మిట్ ఒక ప్రముఖ వేదికగా నిలుస్తుంది.

ఈ సమ్మిట్‌లో పాలసీ మేకర్లు, క్రీడా నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమ ప్రతినిధులు క్రీడారంగా నిశ్నాతులు మేధావులుపాల్గొని భారత క్రీడారంగ అభివృద్ధికి దోహదపడే అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి  ఆలోచనల మేరకు యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (YIPESU): బలమైన క్రీడా వ్యవస్థను నిర్మించడానికి మరియు ప్రత్యేక క్రీడా కేంద్ర అభివృద్ధికి ముఖ్యమైన స్థంభంగా, YIPESU ను తెలంగాణ రాష్ట్రంలో స్థాపించారు.

• రాష్ట్రంలో బలమైన మరియు స్థిరమైన క్రీడా వ్యవస్థను నిర్మించడం.

• క్రీడా రంగంలో ఉన్నత స్థాయి విద్య మరియు శిక్షణను అందించడం.

• యువతలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడం కొరకు ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీ ఆ లక్షణాలను అందుకునే దిశగా సీఎం రేవంత్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారి ఆదేశాల మేరకు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇది మొట్టమొదటి కార్యక్రమం.

Related News

Select the Topic
Scroll to Top