ఈతరం భారతం హైద్రాబాద్ మే 2
బీహార్ ఎన్నికల ముందు దేశవ్యాప్తంగా జరిగే జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కలు చేపడతామని ఢిల్లీలో ప్రకటించిన ప్రధాని బీహార్ ఎన్నికలు ముగియగానే బీసీలకు మొండి చెయ్యి చూపించా రని, బీసీ కుల గణన చేస్తామని ప్రకటించిన తర్వాతే తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ అడుగు పెట్టాలని లేదంటే ఈనెల 10 న రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ నల్లజెండాలతో నిరసన కార్యక్రమాలు చేపడతామని అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాల నేతలు వెల్లడించారు
హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జాతి జనగణలో బీసీ కులదరణ చేపట్టాలని ప్రధ డిమాండ్ తో బీసీ సంఘాలు అఖిల రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం బీసీ కులసంఘాల జేఏసీ చైర్మన్ కుందా గణేష్ చారి అధ్యక్షతన జరిగింది .బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నుండి వి హనుమంతరావు, బిఆర్ఎస్ నుండి మధుసూదనాచారి, వి శ్రీనివాస్ గౌడ్, టీజేఎస్ నుండి ప్రొఫెసర్ కోదండరాం, సిపిఎం నుండి జాన్ వెస్లీ కుందారం గణేష్ చారి చైర్మన్ బీసీ కుల సంఘాల జేఏసీబీసీ కుల సంఘాల జేఏసీ హాజరయ్యారు .















