హైదరాబాద్ నవంబర్ 11 (ఈతరం ఇండియా న్యూస్ ); అంబర్పేట నియోజకవర్గం లో నివసిస్తున్న అన్ని వర్గాల ప్రజలు తనకు మద్దతు పలుకుతున్నారని అంబర్పేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ అన్నారు.ఈ రోజు కాచిగుడా డివిజన్, బసంత్ కాలనీ మరియు ఓల్డ్ బసంత్ థియేటర్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీ భీష్మ దేవ్, డా శిరీష ఓం ప్రకాష్ యాదవ్, సీనియర్ నాయకులు శ్రీ దిడ్డి రాంబాబు గార్లు, పార్టీ నేతలు మరియు కార్యకర్తలతో కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచార పాదయాత్ర ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే గారు ప్రజలు, మరియు పెద్ద సంఖ్యలో అక్కడ నివసిస్తున్న జైన్ సముదాయ వర్గాల వారికి సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు మరియు జైన్ సమాజం కోసం చేస్తున్న కృషిని తెలిపి, బీఆర్ఎస్ ను గెలిపించవల్సిందిగా విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రజలు ప్రభుత్వం అందించిన సంక్షేమంతో సంతృప్తి వ్యక్తం చేయగా, జైన్ సంఘాల నాయకులు సీఎం కేసీఆర్ జైన్ సమాజానికి అండగా నిలవడమే కాకుండా, గత నెలలో, తమకు ప్రత్యేక భవనం నిర్మించుకోవడానికి రెండు ఎకరాల భూమిని కుడా అందించి చాలా పెద్ద తోడ్పాటు అందించారని పేర్కొంటూ, తామందరం కాలేరు వెంకటేష్ గారికి మద్దత్తు ఇస్తామని ప్రకటించారు.కాచిగుడా డివిజన్, బసంత్ కాలనీ మరియు ఓల్డ్ బసంత్ థియేటర్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ , డివిజన్ ప్రెసిడెంట్ శ్రీ భీష్మ దేవ్,డా. శిరీష ఓం ప్రకాష్ యాదవ్, సీనియర్ నాయకులు శ్రీ దిడ్డి రాంబాబు గార్లు, పార్టీ నేతలు మరియు కార్యకర్తలతో కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచార పాదయాత్ర ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే ప్రజలు, మరియు పెద్ద సంఖ్యలో అక్కడ నివసిస్తున్న జైన్ సముదాయ వర్గాల వారికి సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు మరియు జైన్ సమాజం కోసం చేస్తున్న కృషిని తెలిపి, బీఆర్ఎస్ ను గెలిపించవల్సిందిగా విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రజలు ప్రభుత్వం అందించిన సంక్షేమంతో సంతృప్తి వ్యక్తం చేయగా, జైన్ సంఘాల నాయకులు సీఎం కేసీఆర్ జైన్ సమాజానికి అండగా నిలవడమే కాకుండా, గత నెలలో, తమకు ప్రత్యేక భవనం నిర్మించుకోవడానికి రెండు ఎకరాల భూమిని కుడా అందించి చాలా పెద్ద తోడ్పాటు అందించారని పేర్కొంటూ, తామందరం కాలేరు వెంకటేష్ మద్దత్తు ఇస్తామని ప్రకటించారు.
















