హైదరాబాద్ నవంబర్ 11 (ఈతరం ఇండియా న్యూస్);: బీజేపీకి రాములమ్మ గుడ్‌బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఆమె కమలం పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. ఎప్పటి నుంచో ఆమె పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి బీజేపీని వీడినప్పుడే విజయశాంతి కూడా పార్టీ మారతారని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. ఈసారి మాత్రం పార్టీ మార్పు ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఆమె వరుసగా పెడుతున్న ట్వీట్లే కారణంగా తెలుస్తోంది.గత కొంతకాలంగా పువ్వు పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కూడా లభించలేదు.. పైగా స్టార్ క్యాంపెయినర్ లిస్ట్‌లో కూడా చోటు దక్కలేదు. దీంతో రాములమ్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఓ వైపు ఉధృతంగా ప్రచారం జరుగుతున్నా ఎక్కడా పాల్గొనడం లేదు. దీంతో నేడో.. రేపో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు పొలిటికల్‌గా చర్చ నడు
















