EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పేద విద్యార్థి చదువు కు వెస్సో రూ.55 వేలసాయం

ఈతరం భారతం విజయవాడ జూన్ 14;

విజయవాడ కు చెందిన పరసా నాగలక్ష్మి (39) గత పదేళ్లుగా తన కుటుంబాన్ని ఒంటరిగా పోషిస్తున్నారు. ఆమె భర్త కృష్ణ, గతంలో లారీ క్లీనర్‌గా పనిచేసేవారు. అయితే ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయి, అప్పటి నుండి కుటుంబ బాధ్యతలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.నాగలక్ష్మి మరో ఇంటి పనిమనిషి గా పనిచేస్తూ తన ఇద్దరు కుమారులను పోషిస్తున్నారు.

ఆమె పెద్ద కుమారుడు ప్రతాప్ (16) తెలివైన, కష్టపడి చదివే విద్యార్థి. అతను 2025 సంవత్సరంలో జరిగిన పదో తరగతి (SSC) పరీక్షల్లో 600 మార్కులకు గాను 565 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. బాలుడి విద్యా ప్రతిభను గుర్తించిన వెస్సో గత సంవత్సరం అతని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ట్యూషన్ ఫీజు గౌరవ దాతల సహకారంతో చెల్లించింది. ప్రతాప్ చక్కగా చదివి, 2026లో నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 470 మార్కులకు గాను 428 మార్కులు సాధించాడు.

ప్రస్తుతం ప్రతాప్ రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ ట్యూషన్ ఫీజు గా రూ.55,000/- చెల్లించాల్సి ఉంది. అందుకోసం అతని తల్లి నాగలక్ష్మి విజయవాడ లోని శరత్ చంద్ర కళాశాలలో రెండవ సంవత్సరం ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు ఆర్థిక సహాయం అందించాలని వెస్సోను సంప్రదించారు. స్పందించిన వెస్సో ట్రస్టీలు గౌరవ దాతల సహకారంతో 55 వేల రూపాయలను వెస్సో కోశాధికారి టేకి వీ వీ డి వరప్రసాద్ మరియు ఏపీ ట్రాన్స్కో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీవీఆర్కే ప్రసాదుల ద్వారా నేరుగా కాలేజ్ కు చెల్లించారు. ఈ సందర్భంగా వెస్సో వెస్సో ట్రస్ట్ అధ్యక్షుడు బంగారు తాతారావు మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ కనపరుస్తున్న ఒక పేద విద్యార్థి ఇంటర్ పూర్తి చేయడానికి సహాయపడిన గౌరవ దాతలకు పేరు పేరునా ధన్యవాదములు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top