ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 17
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మందాన మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ప్రతిష్ఠాత్మక టైం మేగజైన్ డుదల చేసిన ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ క్రీడాకారిణిగా నిలిచారు. అథ్లెట్లు, కోచ్‌లు, ఇన్వెస్టర్లతో కూడిన ఈ జాబితాలో ఆమె ఎంపిక కావడం భారత క్రికెట్‌కు గర్వకారణం. కాగా LeBron James, Lionel Messi వంటి దిగ్గజాలు కూడా ఈ జాబితాలో చోటు సంపాదించారు.















