బీబీఆర్ఎస్‌లో చేరిన పాల్వాయి స్రవంతి
హైదరాబాద్ నవంబర్ 12 (ఈతరం ఇండియా న్యూస్);: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్‌లో చేరారు. శనివారం నాడు కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన స్రవంతి.. ఇవాళ తెలంగాణ భవన్ వేదికగా మంత్రి కేటీఆర్ సమక్షంలో పాల్వాయి స్రవంతి బి ఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. చేరిక అనంతరం స్రవంతి మాట్లాడుతూ.. గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదని తన తండ్రి గతంలో చెప్పారని స్రవంతి అన్నారు. తనకు గౌరవం ఇవ్వని కాంగ్రెస్(లో ఉండాల్సిన అవసరం లేదని అందుకే పార్టీ నుంచి బయటకి వచ్చానని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన అనుచరులు, కార్యకర్తల భవిష్యత్తును కేటీఆర్ చేతిలో పెడుతున్నామని.. తమ భవిష్యత్తుకు అండగా నిలవాలని కోరారు. బీఆర్ఎస్ లోకి రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ లో ముందు నుంచి ఉన్న నేతలను కాదని కొత్తవాళ్లకు పదవులు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పదవుల కోసం బీఆర్ఎస్ లో చేరలేదని అన్నారు.
















