EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఉపాధి హామీతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 90 రోజుల పని

ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 22

రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా లబ్ధిదారులు తమ సొంత ఇంటి నిర్మాణంలో పాల్గొని, 90 రోజుల పాటు రోజుకు సగటున రూ. 300 చొప్పున వేతనం పొందవచ్చు. ఒక్కో కుటుంబానికి అదనంగా రూ. 27,000 వరకు లభించనుంది. ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చే రూ. 5 లక్షల ఆర్థిక సహాయానికి ఈ ఉపాధి హామీ వేతనం అదనంగా జతకానుంది. జాబ్‌కార్డు కలిగిన లబ్ధిదారులు ఈ ప్రయోజనం పొందవచ్చు. కలెక్టర్లు, ఎంపీడీవోలే నేరుగా లబ్ధిదారులను గుర్తించి 90 రోజుల పనిని మంజూరు చేసే అధికారం కల్పించారు.

Related News

Select the Topic
Scroll to Top