EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం

ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 22

తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు సోమవారం బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ నవీన్ మిత్తల్, ఐఏఎస్ తో సమావేశమయ్యారురాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన పలు కీలక సమస్యలపై వారు సుదీర్ఘంగా చర్చించారు

ఈ సందర్భంగా ఉద్యోగులకు 01.04.2026 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ  కోసం వెంటనే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న EPF, GPF సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు

వైటీపీఎస్ (YTPS) కోల్ ప్లాంట్ మరియు యాష్ ప్లాంట్ టెండర్లకు సంబంధించిన అంశాలపై కూడా చర్చిస్తూ, ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనాలని, అవసరమైతే సంబంధిత నిబంధనల్లో మార్పులు చేయాలని కోరారు.EPF ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం ఎదుర్కొంటున్న వైద్య సమస్యలను ప్రస్తావిస్తూ, అర్హులైన రిటైర్డ్ ఉద్యోగులందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లను వెంటనే క్లియర్ చేయాలని, 35-36 సంవత్సరాల పాటు సేవలందించి పదవీ విరమణకు చేరువలో ఉన్న ఉద్యోగులకు శాశ్వత ప్రమోషన్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.విద్యుత్ సంస్థల్లో వివిధ కేడర్లలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కూడా జేఏసీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉద్యోగుల కొరత కారణంగా విధుల్లో ఉన్న సిబ్బందిపై అధిక పనిభారం పడుతోందని, ఇది ఉద్యోగుల పనితీరు మరియు వినియోగదారులకు అందించే సేవలపై ప్రభావం చూపే అవకాశముందని వివరించారు.

విద్యుత్ రంగ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, అర్హులైన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కొత్త నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.అదేవిధంగా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగుల చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను కూడా జేఏసీ ప్రతినిధులు స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిత్తల్ గారి దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్ రంగంలో క్షేత్రస్థాయిలో కీలక సేవలు అందిస్తున్న ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సమావేశంలో థర్డ్ డిస్కమ్అంశాన్ని కూడా టీజాక్ ప్రతినిధులు ప్రస్తావించారు. గతంలో అమలులో ఉన్న విధంగా ఉద్యోగుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసం ఉద్యోగి సంఘాలు, యాజమాన్యం మరియు ప్రభుత్వం భాగస్వామ్యంతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చాలని విజ్ఞప్తి చేశారు.

స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిత్తల్  టి జాక్ ప్రస్తావించిన అంశాలన్నింటిపై సానుకూలంగా స్పందిస్తూ, జేఏసీ ప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు గారి దృష్టికి తీసుకెళ్లి, విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో చర్చించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టి త్వరలోనే సానుకూల నిర్ణయాలు తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తారనే అపోహలను కొందరు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని, వాటిని విశ్వసించరాదని ఆయన టీజాక్ ప్రతినిధులకు సూచించారు. విద్యుత్ ఉద్యోగులందరూ సంస్థల అభివృద్ధి మరియు విద్యుత్ రంగ ప్రగతిని దృష్టిలో ఉంచుకొని అంకితభావంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రజలకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రతి ఉద్యోగి తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని కోరారు. ముఖ్యంగా ప్రస్తుత వర్షాకాల పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండి, ఎటువంటి విద్యుత్ అంతరాయాలు తలెత్తకుండా విద్యుత్ వ్యవస్థను పరిరక్షించే విధంగా కృషి చేయాలని సూచించారు.

వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా అందరూ సమన్వయంతో పనిచేసి నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించాలని పిలుపునిచ్చారు.సమావేశంలో ప్రస్తావించిన పీఆర్సీ, EPF-GPF సమస్యలు, వైద్య సదుపాయాలు, పెండింగ్ ప్రమోషన్లు, కొత్త నియామకాలు, ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలు, తృతీయ డిస్కం ఉద్యోగుల భద్రత మరియు ఇతర ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పట్ల తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను త్వరితగతిన పరిష్కరించి, విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే ఆశాభావాన్ని టీజేఏసీ వ్యక్తం చేసింది.

Related News

Select the Topic
Scroll to Top