ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 22 :
ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పేరుతో 27000 ప్రభుత్వ పాఠశాలలో 23000 ప్రభుత్వ పాఠశాలల ఎత్తివేతకు కుట్రను ఆపాలని, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఆర్థిక దోపిడిని అరికట్టి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని ఖాళీగా ఉన్న టీచింగ్,నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, గురుకుల పాఠశాలలకు పక్క భవనాలు నిర్మించాలని, NEP 2020 ని వెంటనే అమలు చేయాలని ప్రైవేట్ స్కూల్ మేనేజ్ మెంట్ల ఆధ్వర్యంలో నడుస్తున్న బుక్స్,యూనిఫామ్స్ విక్రయాలను నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్ కు ABVP పిలుపునిచ్చిందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ సికింద్రాబాద్ జిల్లా, బేగంపేట్ నగర శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమవేశం లో వెల్లడించారు.















