EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఇప్పుడు వరి సాగులో తెలంగాణ నెంబర్ వన్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 30

వేలకోట్ల రూపాయల కమిషన్ల కోసం బీఆర్ఎస్ హయాంలో హడావుడిగా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.  లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలినా.. ఇప్పుడు వరిసాగులో తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందన్నారు. బోరు కింద పంటలు పండినా కాళేశ్వరం మహిమ అంటూ ప్రజలను మోసం చేశారని చెప్పారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో నిర్వహించిన సభలో రైతు భరోసా నిధుల పంపిణీని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు.

“కేసీఆర్ ఒక్కసారైనా రైతు రుణమాఫీ పూర్తి చేశారా? దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారా? ప్రజలకు ఏం చేశారని కేసీఆర్ మళ్లీ రావాలని అనుకుంటారు? పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇంటికో ఉద్యోగం ఇచ్చారా? ఊరూరికి బెల్ట్ షాప్ తెచ్చి తాగుడు సంస్కృతి నేర్పించారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే చేసేదేమీ ఉండదు. వరి వేస్తే ఉరే అని బెదిరించి రైతుల పంటను కొనలేదు. ఫామ్ హౌస్ లో కూర్చుని భార్యాభర్తలు మాట్లాడుకునే ఫోన్లు విన్నారు. దొంగచాటుగా తన ఫోన్లు విన్నారని స్వయంగా కేసీఆర్ కుమార్తె చెప్పారు. పేదల ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తామని మోదీ అన్నారు.. వేశారా? మరి …ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఆయన చెప్పారు.. ఇచ్చారా? పశ్చిమ బెంగాల్ లో ఉడికిన పప్పులు తెలంగాణలో ఉడకవు. అక్కడ గెలిచేందుకు భాజపాకు 15 ఏళ్లు పట్టింది. తెలంగాణలోనూ ఆ పార్టీ గెలవాలంటే మరో 15 ఏళ్లు పడుతుంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకువచ్చాం. మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తున్నామని ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టారు. మహిళలతో ఆర్టీసీ బస్సుల కొనుగోలు చేయించి యజమానులుగా చేశాం. రెండేళ్లలోనే 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.ఎల్నినో ప్రభావం వల్ల ఈసారి తక్కువ వర్షాలు పడ్డాయి. రైతుల వరిసాగు తగ్గించి మెత్త పంటలు వేసుకోవాలి. వ్యవసాయం అంటే దండగ కాదు.. పండగ అనుకునేలా చేస్తున్నాం. 9 రోజుల్లో రైతుల ఖాతాల్లో రూ.9వేల కోట్లు వేస్తాం. ఒక్కో సమస్యను చక్కబెట్టుకుంటూ సంక్షేమం కొనసాగిస్తున్నాం. సాగు పనులు మొదలయ్యేనాటికే రైతుభరోసా అందించాం. ఉమ్మడి రాష్ట్రాన్ని 19 మంది ముఖ్యమంత్రులు పాలించారు. వారు చేసిన అప్పు రూ.60వేల కోట్లు మాత్రమే. తెలంగాణ వచ్చాక కేసీఆర్ చేసిన అప్పు రూ.8.11లక్షల కోట్లు. అప్పుల ఊబిలో మునిగిన రాష్ట్రాన్ని నాకు అప్పగించారు. 2023లో సీఎస్ వంటి ఐఏఎస్ అధికారులకే 1న జీతాలు ఇవ్వలేని పరిస్థితి. కొన్నేళ్లుగా వాయిదా పద్దతిలో వస్తున్నాయని అధికారులు తెలిపారు. బడి పిల్లల తిండి బిల్లులు కూడా రూ.వేల కోట్ల బకాయిలు పెట్టారు. సర్పంచల బిల్లులు రూ.వేలకోట్లు పెండింగ్ పెడితే.. వారు ఇప్పుడు ధర్నాలు చేశారు. బిల్లులు పెండింగ్ పెట్టింది కేసీఆర్.. ఆ బద్నాం మోసింది నేను. కేసీఆర్ చేసిన అప్పులతో ఢిల్లీలో కూడా పరువు పోయే పరిస్థితి వచ్చింది” అని రేవంత్ అన్నారు.

Related News

Select the Topic
Scroll to Top