EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వీబీ-జీరామ్ జీ పథకం దేశవ్యాప్తంగా అమలు

ఈతరం భారతం న్యూఢిల్లీ జూలై 1

గ్రామీణ కార్మికులకు ఉపాధి, మెరుగైన ఆదాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)’పథకాన్ని బుధవారం దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద రోజువారీ వేతనాన్ని రూ.300కు పెంచుతూ, ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. దేశవ్యాప్తంగా సగటు రోజువారీ వేతనం రూ.299 నుంచి రూ.327కు పెరిగింది. తక్కువ వేతనాలున్న యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో 15-25% వరకు వేతనాలు పెరిగాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Related News

Select the Topic
Scroll to Top