ఈతరం భారతం హైద్రాబాద్ (అమెరికా ) జులై 1;అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని సిన్సినాటి లో ప్రముఖ సంస్థ డాక్టర్ రామినేని ఫౌండేషన్ మరియు తరంగిణి తెలుగు అసోసియేషన్ ఆఫ్ సిన్సినాటి సంయుక్త ఆధ్వర్యంలో సమర్పించిన కళా రత్న కె.వి సత్యనారాయణ రచన నృత్య దర్శకత్వం వహించిన మోహిని భస్మాసుర కూచిపూడి నృత్య రూపకం ఆశాంతము ప్రేక్షకుల మన్నన పొందినది. మోహినిగా కుమారి చదలవాడ శ్రీల హైంధవి, భస్మాసురునిగా చదలవాడ శ్రీధ వరాలి ఎంతో అద్భుతంగా పాత్ర పోషణ చేశారు. మిగిలిన పాత్రలో వంశీ నాట్య కళాశాల విద్యార్థులు ఎంతో చక్కగా పాత్ర పోషణ చేశారు. కళా రత్న కేవీ సత్యనారాయణ పది రోజులు ఈ నృత్య రూపకం రూపొందించడానికి సెన్సేనాటిలో ఉన్న నాట్య కళాకారులకు శిక్షణ ఇచ్చి ప్రదర్శించడం అయినది. మొత్తం 37 మంది కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది.అమెరికాలోనే ఉత్తమ థియేటర్స్ లో ఒకటైన ఎమరీ థియేటర్ లో ప్రదర్శన నిర్వహించడమైనది. ప్రదర్శన అనంతరం కె వి సత్యనారాయణ ను రాడా. రామినేని ఫౌండేషన్ ఛైర్మన్ రామినేని ధర్మాచార్య, ఏపీ భాజపా మీడియా వ్యవహారాల ఇన్‌ఛార్జ్ పాతూరి నాగభూషణం, డాక్టర్ చదలవాడ రాజ గోపాల్, చదలవాడ శారద, రామినేని సోదరులు కె వి సత్యనారాయణ ప్రతిభను నాట్య కళకు వారు చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ ఘనంగా సత్కరించారు.















