EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

భారతీయ వస్త్రధారణకు సాంప్రదాయ చిత్రకళ దోహదం చేస్తుంది తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ

 

హైదరాబాద్ నవంబర్ 12 (ఈతరం ఇండియా న్యూస్);భారతీయ చీరకట్టు ప్రపంచ  వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిందని చీరలపై సాంప్రదాయ చిత్రాలువన్నె తెచ్చాయని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. రవీంద్రభారతిలో అపర్ణ ఫైన్ ఆర్ట్స్ ,యువకళావాహిని, పొలెన్ ఆర్ట్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు నిర్వహించిన భారతీయ సాంప్రదాయ   వస్త్ర ప్రదర్శన వైభవంగా ముగిసింది. సందడిగా కలివిడిగా పండుగల సాగిన భిన్న భాషీయుల సమైక్యరాగం ఈ ప్రదర్శనలో కొత్తదనాన్ని ఆలోచనలు రేకెత్తించాయని 17 నుండి 86 సంవత్సరాల వయస్కులు ఉత్సాహంగా ప్రదర్శనలో పాల్గొనడం అభినందనీయమని మామిడి కృష్ణ ప్రశంసించారు. ముంబై,.బెంగళూరు ,చెన్నై ,కొచ్చిన్, ఆంధ్ర ప్రదేశ్ ,తెలంగాణ, ఒరిస్సా ప్రాంతాల కళాకారులు తీర్చిదిద్దిన ఈ కళా ప్రదర్శన జాతీయ సమైక్యతను కళాకారుల సద్భావనను ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.. ప్రొఫెసర్ గీతా కృష్ణమాచారి, జలంధర్, పలాస, లంక లక్ష్మీనారాయణ, రఘు శ్రీ, వంటి ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ ప్రదర్శనలో అపర్ణ అప్పలరాజు దంపతులు తోపాటు బీనా గుప్తా, దేవంశు, దామానిషా ,పసుమర్తి కీర్తన, కుసుమ పరమార్ ,మోక్షం భక్తవత్సల ,నేహాజైన్, ప్రత్యూష, జగదీష్ వొమ్ము సోఫియా, సీమ సుబేదార్, శివాంజలి ,దేశ్ముఖ్, కోమల్ బజ్వా, కంకర గ్రీష్మ శ్రీ తదితరులు తమ చిత్రాలకు వాడిన రంగుల గురించి వివరించారు.

Related News

Select the Topic
Scroll to Top