EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులివ్వాలి

ఈతరం భారతం హైదరాబాద్ జులై 13:

రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజెఎఫ్) రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పి రాంచందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని సీఎం ప్రకటించినప్పటికీ, ఆ ప్రక్రియ ముందుకు సాగటంలేదని అన్నారు. ఇండ్ల జాగల మంజూరుకు సంబంధించి మంత్రివర్గ ఉప సంఘానికి స్పష్టమైన ఆదేశాలివ్వాలని సీఎంను కోరారు. టి డబ్ల్యూ జే ఎఫ్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం హెచ్ యు జే ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు జర్నలిస్టులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ జితేందర్ రెడ్డి, డీఆర్వో నారాయణని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ రాంచందర్ మాట్లాడుతూ… నిబంధనల పేరుతో అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని అన్నారు. అర్హత ఉంటే నిబంధనలను సడలించైనా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. సబ్ కమిటీ పేరుతో కాలయాపన జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్ యూజే అధ్యక్షులు బి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. హెచ్ యూజే కార్యదర్శి బి జగదీశ్వర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇచ్చిన ఆర్టీసీ బస్ పాస్ లకు సంబందించి 1/3 ఫేర్ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని చెప్పారు. టోల్ చార్జీలు, సెస్ పేరుతో జర్నలిస్టులపై అదనపు భారం పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో జర్నలిస్టులకు ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఇప్పటికే అమలవుతున్న రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని సూచించారు. హైదరాబాద్ లో పని చేస్తున్న జర్నలిస్టులకు మెట్రో రైలులో ఉచిత ప్రయాణం కల్పించాలని కోరారు. హెచ్ యూజే వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్, కోశాధికారి బి రాజశేఖర్ మాట్లాడుతూ. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి వాటిని పరిష్కరించాలని అన్నారు. ఈనెల 15న హైదరాబాద్ లో ఐ అండ్ పీఆర్ కమిషనర్ కార్యాలయం వద్ద నిర్వహించే మహా ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. డీజేఎఫ్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మస్తాన్ మాట్లాడుతూ జర్నలిస్టులకు అక్రిడీటేషన్ల జారిలో నిర్లక్ష్యం సరికాదన్నారు. హెచ్ యూజే – టీడబ్ల్యూజేఎఫ్ కార్యక్రమాలకు డీజేఎఫ్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె నిరంజన్, జాతీయ కౌన్సిల్ సభ్యులు చిట్యాల మధుకర్, హెచ్ యూజే ఉపాధ్యక్షులు బి దామోదర్, పీ సర్వేశ్వర్ రావు, ఎం రమేష్, జీ వీరేష్, ఎస్ రమేష్, బి కాలేబ్, జీ రేణయ్య, సహాయ కార్యదర్శులు ఎం జీవన్ రెడ్డి, ఎస్ మాధవరెడ్డి, పి లక్ష్మణ్ రావు, కార్యవర్గ సభ్యులు కె లలిత, పీ విజయ, టీ రాజేష్ కుమార్ , బస్వరాజు, రాజశేఖర్, వెంకట్, వినోద్ రావు తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top