ఈతరం భారతం హైద్రాబాద్ జులై 25 ;
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సికింద్రాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ప్యారడైజ్ నగరంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ క్లాక్ టవర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ చేర్క బాలకృష్ణ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ లు విడుదల కాగా విద్యార్థులు హరిగోసలు పడుతున్నారని. ప్రభుత్వం స్కాలర్షిప్ విడుదల చేయని కారణంగా కాలేజీలలో సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏబీవీపీ ఉద్యమాలకు శ్రీకారం చుడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిటీ ఎస్ ఎఫ్ డి కన్వీనర్ పాండురంగ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మిద్దెల గౌతమ్ నగర సంయుక్త కార్యదర్శి వికాస్ కార్యకర్తలు వరుణ్, రేవంత్, శివ, హర్షవర్ధన్, మణి మరియు ఇతర కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు.














