ఈతరం భారతం న్యూఢిల్లీ జూలై 25
మహంత కుమార్తె దిబిశా మహంత నీట్ వివాదంపై విద్యార్థుల నిరసనలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఆమె నిరసనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.గౌహతిలోని చంచల్ ప్రాంతంలో దిబిశా మహంత కేంద్రానికి వ్యతిరేకంగా విద్యార్థులతో కలిసి ప్లకార్డులు పట్టుకుని నిరసన చేశారు. నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనకారులతో కలిసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతేకాకుండా.. నిరసన సందర్భంగా దిబిశా మహంత మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.














