EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణ ఉద్యమ మేధోశక్తి ఎ.పద్మాచారి : జన్మదిన వేడుకల్లో వక్తలు ఉద్ఘాటన

ఈతరం భారతం.హైద్రాబాద్ జులై 25;

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పద్మాచారి సేవలనుప్రముఖులు కొనియాడారు.తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ న్యాయవాది ఎ. పద్మాచారి జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లోని హోటల్ అబోడ్‌లో అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ రాజకీయ, సామాజిక, ఉద్యోగ, న్యాయ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఒకే వేదికపై చేరి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమంలో, ఉద్యోగుల సంక్షేమంలో, సమాజ సేవలో ఆయన చేసిన విశిష్ట సేవలను కొనియాడారు.

వివాదాలకు అతీతుడు… అపార జ్ఞానం కలిగిన వ్యూహకర్త… బీసీల పెద్దన్న అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.ఉద్యోగి నుంచి సుప్రీంకోర్టు న్యాయవాది వరకు ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్నారూ. పాట రూపంలో పద్మాచారి సేవలను ఆవిష్కరించిన దరువు అంజన్న… భావోద్వేగానికి సభికులు గురైన్నారుపదవులు మనిషిని గొప్పవాడిని చేయవు… ప్రజల హృదయాల్లో నిలిచే సేవలే చరిత్రలో చిరస్థాయిగా నిలిపేస్తాయని కొనియాడారు

ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, వడ్డెర సహకార సంస్థ చైర్మన్ గట్టు తిమ్మప్ప, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతమ్ రావు, బీజేపీ అధికార ప్రతినిధి కప్పర ప్రసాద్, తెలంగాణ సాంస్కృతిక ప్రతినిధి దరువు అంజన్న, ప్రొఫెసర్ జయకిషన్, గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత శాంతి కృష్ణ, సీనియర్ అడ్వకేట్ పెండోట శ్రీనివాస్, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీ రాములు, తెలంగాణ బీడీఎల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దానకర్ణ చారితో పాటు ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, మేధావులు, సామాజికవేత్తలు, పెద్ద సంఖ్యలో తెలంగాణ ఉద్యోగుల సంఘ సభ్యులు పాల్గొన్నారు.

ప్రారంభంలో కేక్ కటింగ్, శాలువాతో ఘన సన్మానం, పుష్పగుచ్ఛాల అందజేత, జ్ఞాపికల ప్రదానం నిర్వహించారు.

దరువు అంజన్న పాటతో హృదయాలను హత్తుకున్న వేడుక

కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక ప్రతినిధి దరువు అంజన్న తనకు పద్మాచారి గారితో ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని పాట రూపంలో ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో పద్మాచారి పోరాట స్ఫూర్తి, ఉద్యమానికి అందించిన మేధోబలం, ఉద్యోగుల కోసం చేసిన నిరంతర పోరాటం, సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధతను భావోద్వేగభరితమైన గీతంలో ఆలపించగా సభికులంతా చప్పట్లతో అభినందించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగుల సెంట్రల్ అసోసియేషన్‌కు నాయకత్వం వహిస్తూ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన ఆయన పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, అందరికీ పెద్దన్నగా నిలిచిన వ్యక్తిత్వాన్ని అంజన్న హృదయాలకు హత్తుకునేలా వివరించారు.

వివాదాలకు అతీతుడు… విజ్ఞానానికి ప్రతిరూపం

వక్తలందరూ ఒకే స్వరంతో పద్మాచారి గారిని వివాదాలకు దూరంగా ఉండే సౌమ్యుడు, అపారమైన జ్ఞాన సంపద కలిగిన వ్యూహకర్త, బీసీ సమాజానికి పెద్దన్న, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మార్గదర్శి, ప్రజల పక్షాన నిలిచే మేధావిగా అభివర్ణించారు.

సెక్షన్ ఆఫీసర్‌గా ప్రభుత్వ సేవ నుంచి పదవీ విరమణ చేసిన అనంతరం కూడా విశ్రాంతి తీసుకోకుండా తెలంగాణ హైకోర్టు, భారత సుప్రీంకోర్టుల్లో న్యాయవాదిగా ప్రజా సమస్యలపై చట్టపరమైన పోరాటం కొనసాగించడం ఆయన సమాజ సేవకు నిదర్శనమని కొనియాడారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగుల సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల శక్తిని ఉద్యమానికి అంకితం చేస్తూ రాష్ట్ర సాధనలో పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

భారత ప్రభుత్వ మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, 2002 సంవత్సరం నుంచి పద్మాచారి గారితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన, ఉద్యోగులు, నిరుద్యోగ యువతకు న్యాయం జరగాలనే లక్ష్యంతో ఎన్నోసార్లు చర్చలు జరిపారని తెలిపారు. ఉద్యమ కాలంలో ఉద్యోగుల సంఘాలు, ఉద్యోగుల జేఏసీ, పొలిటికల్ జేఏసీ, పలు కమిటీలకు ఆయన అందించిన మేధోబలం తెలంగాణ ఉద్యమానికి ఎంతో దోహదపడిందన్నారు.

పద్మాచారి అవసరమైన ప్రతి ఒక్కరికీ ఓర్పుతో, సోదరభావంతో మార్గనిర్దేశం చేసే వ్యక్తిత్వం కలిగిన నాయకుడని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు మాట్లాడుతూ, పద్మాచారి గారు గొప్ప జాతీయవాది, దేశం, రాష్ట్రం, సమాజంపై విశేష అవగాహన కలిగిన మేధావి అని కొనియాడారు. ప్రజా సమస్యలపై హైకోర్టు, సుప్రీంకోర్టు స్థాయిలో కూడా చట్టపరమైన పోరాటాలు చేసే ధైర్యసాహసాలు ఆయన ప్రత్యేకత అన్నారు.

ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల గొంతుకగా నిలబడి వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లిన నాయకుడు పద్మాచారి గారని, సమాజం పట్ల బాధ్యతతో పనిచేసే ఆదర్శ వ్యక్తి అని పేర్కొన్నారు.

వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పద్మాచారి చేసిన సూచనలు, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు.

బీజేపీ అధికార ప్రతినిధి కప్పర ప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులతో మమేకమై ఉద్యమానికి మేధోపరమైన బలం అందించడంలో పద్మాచారి గారి పాత్ర మరువలేనిదని కొనియాడారు.

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. గౌతమ్ రావు మాట్లాడుతూ, ఇంతమంది ప్రముఖులు ఒకే వేదికపై చేరి పద్మాచారిని సత్కరించడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు డా.కృష్ణారావు మాట్లాడుతూ, ఉద్యోగ సంఘాలకు పద్మాచారి నాయకత్వం చిరస్థాయిగా ఆదర్శంగా నిలుస్తుందని, ఆయన చూపిన మార్గం భావితరాలకు స్ఫూర్తి అని అన్నారు.

సభాధ్యక్షులు ఎం. రవీందర్ కుమార్ మాట్లాడుతూ, పద్మాచారి గారి సేవలను గుర్తించి జన్మదిన వేడుకలను నిర్వహించడం తెలంగాణ ఉద్యోగుల సంఘానికి గర్వకారణమని, ఆయన అనుభవం, మార్గదర్శకత్వం భవిష్యత్తులో కూడా సమాజానికి ఎంతో అవసరమని అన్నారు.

చివరగా ప్రముఖులందరూ ఎ. పద్మాచారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు పొందాలని, రాబోయే రోజుల్లో దేశంలోనే అత్యున్నత స్థానాలను అధిరోహిస్తూ ప్రజా సేవను మరింత విస్తృతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమం ముగిసే సమయానికి సభికులందరిలో ఒకే భావన వ్యక్తమైంది. తెలంగాణ ఉద్యమానికి మేధస్సును అందించిన నాయకుడు, ఉద్యోగుల పెద్దన్న, సమాజానికి మార్గదర్శకుడు, న్యాయ పోరాట యోధుడు ఎ. పద్మాచారి సేవలు తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిపోతాయన్నారు.

కార్యక్రమం లో తెలంగాణ ఉద్యోగుల సంఘ సభ్యులు డా. కృష్ణారావు – తెలంగాణ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు. వి. సురేందర్ – ఆర్గనైజింగ్ సెక్రటరీ.ఎన్. నర్సింగ్ రావు – తెలంగాణ ఉద్యోగుల సంఘం, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు.పి. కృష్ణమూర్తి– ఛైర్మన్, తెలంగాణ డెయిరీ కమిటీ. వారందరూ పాల్గొని  విజయవంతం చేశారు.

Related News

Select the Topic
Scroll to Top