EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రేపటి నుంచి నీట్- యూజీ కౌన్సిలింగ్!

ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 3

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, వంటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్, నీట్ -యూజీ, 2026 అడ్మిషన్ల కోసం అధికారిక కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది.ఆల్ ఇండియా కోట ఏఐక్యూ,సెంట్రల్ యూనివర్సిటీతో పాటు రాష్ట్ర కోట కౌన్సిలింగ్ కు సంబం ధించిన ముఖ్యమైన అధికారిక తేదీలను ప్రకటించింది.ఈనెల ఆగస్టు 4వ తేదీ నుంచి తొలి రౌండు కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది,ఆగస్టు 5 నుంచి 12వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు పేమెంట్ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది.

ఆగస్టు 6 నుంచి 13వ తేదీ వరకు ఛాయిస్ ఫిల్లింగ్/ లాకింగ్,ఆగస్టు 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నీట్ అలాట్ మెంట్ ,ఆగస్టు 17న తొలి రౌండు ఫలితాలను ప్రకటిస్తారు. సీట్లు సాధించిన విద్యార్థు లు ఆగస్టు 18 నుంచి 22 వరకు రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది.

Related News

Select the Topic
Scroll to Top