హైదరాబాద్ నవంబర్ 13 (ఈతరం ఇండియా న్యూ స్) ; కాంగ్రెస్ బిజెపి పార్టీలనునమ్మితే అంబర్పేటకు అధోగతే పడుతుందని రెండు పార్టీల అభ్యర్థులు దొందు దొందేనని అంబర్ పేట బిఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ అన్నారు. ఈరోజు గోల్నాక డివిజన్లో స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్య తో కలిసి పలు ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు ఉన్నప్పుడు తప్ప ఏనాడు కనిపించని కాంగ్రెస్ బిజెపి పార్టీలకు ఐదేళ్ల నుండి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి ఏం తెలుసునని ఆయన ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా మద్దతిస్తున్నరని అంబర్పేట్ లో మరోసారి గులాబీ జెండా ఎగరవేస్తామని ఆయన అన్నారు. రౌడీయిజం బెదిరింపులకు అంబర్పేట ప్రజలు తావు ఇవ్వరని అటువంటి నేతలకు ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కారు గుర్తుకు ఓటేసి హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మైనారిటీలు మహిళలు వివిధ బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
















