EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ప్రతిపక్షాల వాగ్దానాలు చూసి మోసపోవద్దు భువనగిరి శాసనసభ్యులు టిఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి

యదాద్రి భువనగిరి నవంబర్ 14( ఈతరం ఇండియా న్యూస్); ప్రతిపక్ష కాంగ్రెస్ బిజెపి వాగ్దానాలు నమ్మి మోసపోవద్దని భువనగిరి శాసనసభ్యులు బీ ఆర్ఎస్ అభ్యర్థి పైల శేఖర్ రెడ్డి అన్నారు.మంగళవారం నాడు అయన భువనగిరి మండలం వాడాయి గూడెం గ్రామం లో బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదాల తో బోనగిరి నియోజకవర్గాన్ని అంచలంచలుగా అభివృద్ధి చేసుకుంటూ పోతుంటే ఎన్నికల ముందు వచ్చిన ప్రతిపక్ష పార్టీలు కల్లబొల్లి వాగ్దానాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నాయని అన్నారు. ఎన్ని మాటలు చెప్పినా బోనగిరి ప్రజలు నమ్మరని తిరిగి మరోసారి భువనగిరిలో బిఆర్ఎస్ విజయం సాధిస్తుందని అదేవిధంగా రాష్ట్రంలో కూడా కెసిఆర్ గారి ఆధ్వర్యంలో హ్యాట్రిక్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ఆయన అన్నారు . స్థానిక సర్పంచ్ గుండు మనీష్ గౌడ్ మాట్లాడుతూ, తమ గ్రామ అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తున్న శాసన సభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి కి నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో తమ గ్రామం నుండి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిఆర్ఎస్ నాయకులు గుండు ముత్తయ్య గౌడ్ ఉపసర్పంచ్ పోశెట్టి గౌడ్ గ్రామ బి ఆర్ ఎస్ నాయకులు జక్కుల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top