EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మహిళల భద్రతను పెంపొందించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి : రాష్ట్ర డీజీపీ కి సిటిజన్ ఫోరం, తెలంగాణజన్ సేవా సంఘ్,అభిప్రాయ్ ల వినతిపత్రం

ఈతరం భారతం హైద్రాబాద్ సెప్టెంబర్ 3: గురువారం:

_________________________________________

తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల జరిగిన విషాద సంఘటనల నేపథ్యంలో మహిళల భద్రతను పెంపొందించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డిజిపి (లా& ఆర్డర్) మహేష్ మురళీధర్ భగవత్ కు సిటిజన్ ఫోరం, తెలంగాణజన్ సేవా సంఘ్ లు విజ్ఞప్తి చేశాయి.ఈ మేరకు గురువారం సిటిజన్ ఫోరం, తెలంగాణజన్ సేవా సంఘ్ ప్రతినిధులు ఎల్.ఎం.చౌధరి, అశోక్ కుమార్, సురేష్ పండిట్, జీ.డి.పాఠక్, బినీత్ సింగ్ లు డిజిపి ని కలిసి వినతి పత్రం సమర్పించాయి.

తెలంగాణలో ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, మరియు సంస్థాగత జవాబుదారీతనం కోసం అంకితమైన పౌర సమాజ సంస్థల సమిష్టి ప్రాతినిధ్యమైన సిటిజన్ ఫోరం (తెలంగాణ), జన్ సేవా సంఘ్, మరియు అభిప్రయ్ తరపున విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ పోలీస్ శాఖ యొక్క నిరంతర ప్రయత్నాలను మరియు షీ టీమ్స్ వంటి కార్యక్రమాలను మేము అభినందిస్తూనే, ఇటీవల జరిగిన దారుణ సంఘటనలు, ఉద్యోగాలు చేసే మహిళలు తమ నివాస ప్రాంతాలలో లేదా వాట సమీపంలో కూడా ఎదుర్కొంటున్న తీవ్రమైన భద్రతాపరమైన లోపాలను ఎత్తి చూపుతున్నాయని పేర్కొన్నారు.ఈ బలహీనతలను వ్యవస్థాగతంగా పరిష్కరించడానికి పలు చూచనలు చేశారు.ఈ సంస్థలన్నీ, ఈ సంస్థకు స్ఫూర్తి అయిన వి.కె. సింగ్మార్గదర్శకత్వంలో నడుస్తున్నాయి.

Related News

Select the Topic
Scroll to Top