EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు మానుకోవాలి : మాజీ మంత్రి హరీశ్రావు హితవు

ఈతరం భారతం హైద్రాబాద్ సెప్టెంబర్ 3: గురువారం :

_________________________________________

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు మానుకోవాలని మాజీ మంత్రి హరీశ్రావు హితవు పలికారు. అంబర్ పేట బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట్లలకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. మైకు దొరికితే కేసీఆర్ను విమర్శించడమే అజెండాగా పెట్టుకున్నారని స్పష్టం చేశారు. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు ఆయన రాజకీయ సంస్కారానికి అడ్డం పడుతున్నాయని విమర్శించారు.కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు మాని, ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఎన్నికల హామీల అమలుపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Related News

Select the Topic
Scroll to Top