EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

విపంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20 గ్రామీణ గ్రంధాలయాల ప్రారంభం : ఒక్కో గ్రంథాలయానికి 500 పుస్తకాలు ఒక ర్యాకు ,పత్రికల సంచి అందజేత 

ఈతరం భారతం సెప్టెంబర్ 3 2026. గురువారం :

_______________________________________

గ్రామీణ గ్రంథాలయాలు నెలకొల్పడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి విపంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాదు శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతనముగా ఎన్నుకోబడిన గ్రామపంచాయతీ సర్పంచులు ఇప్పటినుంచి ఫౌండేషన్ చైర్మన్ అనుముల శ్రీనివాస్ పిలుపుకు స్పందించి వారి గ్రామాలలో గ్రంథాల ఏర్పాటుకు ముందుకు వచ్చారు గ్రామపంచాయతీల సర్పంచుల సహకారంతో 20 గ్రామాలలో గ్రంథాలయాలు ఏర్పాటు ప్రారంభోత్సవం జరిగినది ఈ కార్యక్రమానికి గ్రామీణ గ్రంధాలయ ఉద్యమకారులు విపంచి ఫౌండేషన్ చైర్మన్ అనుముల శ్రీనివాస్ అధ్యక్ష ప్రసంగము చేస్తూ గ్రామీణ గ్రంథాలయాల ప్రాముఖ్యత గురించి వివరించారు .ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ మనిషిని ప్రపంచానికి పరిచయం చేసే అక్షరాలు ఆ అక్షరాలు ఉండే పుస్తకాల ఆలయాలు గ్రంథాలయాలు భారతదేశంలో ఎక్కువ పాఠకులున్న రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం ప్రైవేటు గ్రంధాలయాలు ఎక్కువ ఉన్న మొదటి జిల్లా నల్గొండ అని చెప్పారు గ్రామీణ గ్రంధాల అభివృద్ధి కోసం జిల్లా గ్రంధాలయ సంస్థ నుండి నెలకు 3000 రూపాయలు మంజూరు చేస్తామని చెప్పారు గ్రామీణ గ్రంథాలయాల ఏర్పాటు కొరకు విపంచి ఫౌండేషన్ చైర్మన్ అనుమల శ్రీనివాస్ కృషిని ఆయన కొనియాడారు .

విశిష్ట అతిథిగా విచ్చేసిన తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ వేలమంది సర్పంచులలో గ్రంథాలయ ఏర్పాటుకు ముందుకు వచ్చిన 20 గ్రామల సర్పంచులు ప్రత్యేకత కలిగి ఉన్నారు 20 గ్రాముల సర్పంచులు మిగతా సర్పంచులు ఆదర్శంగా తీసుకొని తమ తమ గ్రామాల్లో గ్రంధాలయాలు నెలకులపడానికి ముందుకు రావాలని అన్నారు.తెలంగాణ గ్రంధాలయ పరిషత్ పూర్వ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ మాట్లాడుతూ గ్రంథాలయ ప్రాముఖ్యతను వివరిస్తూ నల్గొండ ప్రాంతంలో గ్రంధాల ఉద్యమం ప్రారంభం కావడం ఉద్యమకారులే గ్రంథాలయ ఉద్యమకారులు కావటం అభినందనీయమని అన్నారు జాతి చైతన్యానికి జీవంనాడు లాంటి గ్రంథాలయాలు పూర్వ ప్రారంభం కావాలని వాటి నిర్వాహన విజయవంతంగా జరగాలని అన్నారు ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ సి భవాని దేవి మాట్లాడుతూ పుస్తకాన్ని చదివితే పుస్తకము మనకు విజ్ఞానం ఇస్తుంది మనిషి నుండి పుస్తకము ప్రేమ పొందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు కవి యాకూబ్ ఉమ్మడి నల్గొండ జిల్లా పూర్వ గ్రంథాలయం అధ్యక్షులు గాద వినోద్ రెడ్డి విపంచి ఫౌండేషన్ ముఖ్య సలహాదారులు అందోజు నాగభూషణం డాక్టర్ మందడి భరత్ రెడ్డి మొదలగు వారు పాల్గొని ప్రసంగించారు 20 గ్రామపంచాయతీ సర్పంచులు తమ గ్రామంలో గ్రంథాలయాలను పాఠకులు వచ్చి చదివే విధంగా అభివృద్ధి చేస్తామని తమ ప్రసంగాలలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో విపంచి ఫౌండేషన్ సభ్యులు శివ శెట్టి ప్రసాద్ బి .గోపికృష్ణ గోపగోని శ్రీనివాస్ , కూరెళ్ళ నరసింహ చారి నకరికంటి సతీష్ తదితరులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు

Related News

Select the Topic
Scroll to Top